సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కోసం 1000 కోట్లు..!

తెలంగాణా సీఎం కే.సి.

 Cm Kcr 1000 Crores For Dalith Empowerment , 1000 Crores, Cm, Dalith Empowerment,-TeluguStop.com

ఆర్ సమక్షంలో హైదరాబాద్ ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.సీఎం కే.

సి.ఆర్ దళిత్ ఎంపవర్ మెంట్ కార్యచరణలపై చర్చించారు.దళితులు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని.అందుకోసమే దళితుల అభ్యున్నతికి దశల వారీగా కార్యచరణ చేపడుతున్నామని చెప్పారు.గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా చూడాలని అన్నారు కే.సి.ఆర్.రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరిగా దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలని అన్నారు.,/br>

ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కోసం 1000 కోట్ల రూ.లు కేటాయిస్తామని అన్నారు.మరో 500 కోట్లు కూడా అదనంగా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరపునుండి ఎలాంటి సహకారం అయినా చేసేందుకు సిద్ధమని కే.సి.ఆర్ ప్రకటించారు.అఖిలపక్ష భేటీలో దళిత్ ఎంపవర్ మెంట్ కోసం కేటాయిస్తున్న 1000 కోట్లను రానున్న బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పారు సీఎం కే.సి.ఆర్.ఇక నాలుగేళ్లలో 40 వేల కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube