నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన

నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా కొలిమిగుండ్లలో రామ్‎కో సిమెంట్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు.5 వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.1,790 కోట్లతో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటయింది.ఈ పరిశ్రమ ప్రతి ఏడాది 2 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేయనుంది.అనంతరం ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు.

 Cm Jagan's Visit To Nandyala District-TeluguStop.com

పరిశ్రమలతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు.

వరుసగా మూడో ఏడాది కూడా నెంబర్ వన్ స్థానంలో ఏపీ నిలిచిందని జగన్ వెల్లడించారు.తమది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్న సీఎం జగన్.

భూములు లీజుకు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉంటే రాష్ట్రంలో ఇంకా పరిశ్రమలు స్థాపించవచ్చన్నారు.అలాగే సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తే.ఎకరాకు ఏడాదికి రూ.30,000 చెల్లించి భూములు లీజుకు తీసుకుంటామని తెలిపారు.మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం లీజు పెంచుతామని స్పష్టం చేశారు.కనీసం రెండువేల ఎకరాలు ఓ క్లస్టర్ గా ఉండాలని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube