మాండూస్ తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

మండౌస్ తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.తుపాను ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 Cm Jagan's Review On The Impact Of Cyclone Mandus-TeluguStop.com

ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.అదేవిధంగా అవసరమైన చోట పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ తీరం దాటింది.దీంతో తీర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

గత అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య ఉన్న మహాబలిపురం సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటింది.ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube