వైద్యారోగ్య శాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

వైద్యారోగ్య శాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.దీనిలో భాగంగా ఆరోగ్య శ్రీ విధానంపై స‌మీక్షించారు.

 Cm Jagan's Review Of The Health Department,cm Jagan, Health Department-TeluguStop.com

ఈ మేర‌కు గ‌ణ‌నీయంగా చికిత్సా విధానాల‌ను పెంచుతున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు.ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి 754 ప్రొసీజ‌ర్ల‌ను అనుమ‌తించారు.

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆరోగ్య శ్రీ కింద 3,118 చికిత్సా విధానాలు వ‌చ్చాయి.ఇక‌పై క‌మ్యూనిటీ హెల్త్ ఆఫీస‌ర్లుగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడ‌ర్లు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో వైద్య క‌ళాశాల ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నీకూడా సంబంధిత జిల్లాలోని మెడికల్‌కాలేజీ పరిధిలోకి తీసుకురావాలన్నారు.ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube