వైసీపీ అధ్యక్ష పదవికి జగన్ రాజీనామా ? కొత్త అధ్యక్షుడు ఆయనేగా ?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నిర్ణయాలన్నీ ఎప్పుడు ఆకస్మికంగా, సంచలనంగానే ఉంటాయి.పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, తనదైన శైలి ముద్ర ఎప్పుడూ కనిపించే విధంగా జగన్ వ్యవహరిస్తూ ఉంటారు.

 Ap, Cm Ys Jagan,sajjala Rama Krishna Reddy, Ycp President,  Vijaya Sai Reddy-TeluguStop.com

సీఎంగా పరిపాలనలో ఎంత సమర్థవంతంగా ఉంటున్నారో అంతే స్థాయిలో పార్టీ విషయాల్లోనూ ఉండాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.కానీ సీఎం హోదాలో నిత్యం ప్రజా సమస్యలు, నిర్ణయాలతో బిజీగా ఉండడం వల్ల పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి జగన్ కు ఉంది.

అందుకే రెండు పడవల మీద కాలు మోపి ఇబ్బందులు పడే కంటే, ఏదో ఒక బాధ్యతను సీరియస్ గా తీసుకుని నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు.దీనిలో భాగంగానే వైసిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే కీలక నిర్ణయం జగన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై తనకు అత్యంత సన్నిహితుల వద్ద జగన్ ప్రస్తావించినట్టు సమాచారం.జగన్ దృష్టి మొత్తం ఇప్పుడు పరిపాలనపైనే ఉంది.

తాను ఎన్నికల సమయంలో అమలు చేస్తానని చెప్పిన మేనిఫెస్టోపైనే దృష్టి పెట్టారు.చెప్పిన విధంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తూ జగన్ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు.

దాదాపుగా మొదటి ఏడాదిలోనే 90 శాతం మేరకు ఎన్నికల హామీలను జగన్ నెరవేర్చాలని చూస్తున్నారు.ఇప్పటికే నవరత్నాలు అమలు చేసి చూపించారు.

ప్రభుత్వపరంగా జగన్ సమర్థవంతంగా పని చేసినప్పటికీ, పార్టీ విషయానికి వచ్చే సరికి అంతగా దృష్టి పెట్టలేక పోతున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ సమావేశాలు, నాయకులను సమన్వయం చేసుకునే విషయంలో జగన్ వెనకబడ్డారనే చర్చ నడుస్తోంది.

మొత్తం వైసిపి రాజకీయ వ్యవహారాలను ఒక విజయసాయిరెడ్డి మాత్రమే చూసుకుంటున్నారు.నాయకులు ఎవరినైనా కలవాలన్న, పార్టీలోకి ఎవరినైనా తీసుకు రావాలన్నా ఇలా మొత్తం అన్ని విషయాల పైన విజయసాయిరెడ్డి కి మాత్రమే హక్కు అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉంది.

Telugu Cm Ys Jagan, Sajjalarama, Ycp-Telugu Political News

ఇక కేంద్ర వ్యవహారాల విషయంలో విజయసాయిరెడ్డి బిజీగానే ఉంటున్నారు.ముందు ముందు కేంద్ర వ్యవహారాల్లో విజయసాయి రెడ్డి జోక్యం పెరిగే అవకాశం ఉండడం వంటి కారణాలతో ఏపీ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని జగన్ చూస్తున్నారు.వైసీపీకి లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉండడంతో, అతిపెద్ద నాలుగో పార్టీగా వైసిపి కీలకంగా వ్యవహరించాల్సి ఉంది.దీంతో పూర్తిగా కేంద్ర వ్యవహారాలు విజయసాయిరెడ్డికి అప్పగించి రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని జగన్ చూస్తున్నారట.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ రెడ్డి తో పాటు, జగన్ సోదరి వైయస్ షర్మిల పేరు కూడా తెరపైకి వచ్చింది.మొదటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కి పార్టీ నాయకులు అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Telugu Cm Ys Jagan, Sajjalarama, Ycp-Telugu Political News

కొద్దిరోజులుగా ఆయన మీడియా ముందుకు వస్తూ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు.దీంతో ఆయనకు త్వరలోనే వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న చర్చ.ముందుగా షర్మిల పేరు తెరపైకి వచ్చినా, ఆమెకు అధ్యక్ష పదవి ఇస్తే కుటుంబ పరిపాలన అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శించే అవకాశం ఉండడంతో అపఖ్యాతి మూట కట్టుకోవలసి ఉంటుందనే అభిప్రాయంతో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన నిర్ణయం జగన్ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube