బీజేపీ వైసీపీ మధ్య చిగురిస్తున్న స్నేహం ? ఇదే నిదర్శనం 

మొన్నటి వరకు తిరుపతి ఎన్నికల సందర్భంగా బిజెపి వైసిపి పై పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుని విమర్శలు చేసింది.జగన్ పరిపాలన,  పని తీరును విమర్శిస్తూ,  రాష్ట్ర కేంద్ర నాయకులు విమర్శలు సంధించారు .

 Cm Jagan Trying To Alliance With Bjp-TeluguStop.com

కేంద్రంపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర నాయకులే విమర్శలు చేస్తూ ముందుకు వెళ్లారు .ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ ఈ విమర్శలు చేశాయి కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా మొదలైన తరువాత కేంద్రం పని తీరుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి  ప్రాంతీయ పార్టీలు మూకుమ్మడిగా విమర్శలు చేస్తూ వస్తున్న సమయంలో, ఏపీ సీఎం జగన్ కేంద్రం విషయంలో సానుకూలంగా మాట్లాడడం, ఈ సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రానికి సహకారం అందిద్దాం అంటూ మాట్లాడడం పై జగన్ పై విమర్శల పాలయ్యారు.

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ తీరుని తప్పుపట్టారు.ఈ వ్యవహారాలు అందిస్తాను కేంద్రం సైతం జగన్ విషయంలో ఇప్పుడు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో తమతో సన్నిహితంగా మెలిగెందుకు ప్రయత్నిస్తున్న జగన్ ను దూరం చేసుకోవడం కంటే , ఆయన మద్దతు తమకు ఉండేలా చేసుకుంటే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో బిజెపి ఉందట.అది కాకుండా మళ్లీ 2024 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని,  టీడీపీ పూర్తిగా బలహీనపడుతుందని , తమ పార్టీ ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి జగన్ విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

 Cm Jagan Trying To Alliance With Bjp-బీజేపీ వైసీపీ మధ్య చిగురిస్తున్న స్నేహం ఇదే నిదర్శనం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొన్నటి వరకు బీజేపీ సహకారంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,

Telugu Amit Shah, Ap, Ap Politics, Arrest, Bjp, Bjp Leaders, Carona, Central Government, Chandrababu, Government, Jagan, Janasena, Modhi, Tdp, Ycp Alliance Bjp, Ycp Mp Raghuramakrishnama Raju, Ysrcp-Telugu Political News

  ఆ పార్టీకి కంట్లో నలుసుగా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసిపి పై డేరింగ్ స్టెప్  వేయడానికి కారణం బిజెపి కేంద్ర పెద్దల నుంచి అందిన భరోసా నే కారణంగా తెలుస్తోంది.ఇక ముందు ముందు కూడా జగన్ కు ప్రత్యక్షంగానూ,  పరోక్షంగానూ సహకారం అందించేందుకు బిజెపి సిద్ధం అవుతోందట.ఇక బీజేపీకి దగ్గరవడం ద్వారా టిడిపిని బీజేపీకి దూరం చేయాలనే ఎత్తుగడ జగన్ లో కనిపిస్తోందట

.

#Carona #Ysrcp #Amit Shah #Government #Arrest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు