నిడదవోలు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. హెలిప్యాడ్ వద్ద పెద్ద ఎత్తున మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సిఎం కు ఘనస్వాగతం పలికారు.
రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి.నేడు నిడదవోలు లో జరిగే వైయస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులకు రూ.536.77 కొట్లు అర్దిక సాయాన్ని 3,57,844 మంది లబ్ది దారులకు విడుదల చేయ నున్న సియం.గత 52 నెలల్లో జగనన్న ప్రభుత్వం కాపు బలిజ, వంటరి, తెలగ కులాలకు చెందిన
70,09,628 మందికి రూ.39,247 కోట్లు ప్రయోజనం చేకూర్చడం జరిగింది.నేరుగా నగదు బదిలీ కింద 61,36,195 మంది లబ్ధిదారులకు 22,333 కోట్లు నగదు రహిత బదలీ ద్వారా 1564433 మంది లబ్ధిదారులకు రూ.16914 కోట్లు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం విశేష కృషి.సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సి.ఎం తో సహా ఏకంగా 4 మంత్రి పదవులు కేటాయింపు.అన్ని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత.







