ఉద్దాన వాసులకు అండగా సీఎం జగన్... బాధితుల కోసం ఆస్పత్రి, తాగునీరు

ఏపీలో దశాబ్దాల కాలంగా ఉద్దానం వాసులు కిడ్నీ సమస్యతో అల్లాడుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పొగొట్టుకున్నారన్న విషయం తెలిసిందే.

 Cm Jagan Stands By The Residents Of Uddanam... Hospital And Drinking Water For T-TeluguStop.com

ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉద్దానం బాధితులను పట్టించుకున్న వారు మాత్రం కరువయ్యారు.కేవలం రాజకీయ లబ్ది మాత్రమే చూసుకున్న గత ప్రభుత్వాలు వీరిని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.

ఎన్నికల సమయాల్లో ముసలికన్నీరు కార్చి, కంటి తుడుపు చర్యలు చేపట్టడం తప్ప వారి సమస్యకు పరిష్కారాన్ని మాత్రం చూపించలేకపోయాయి.

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ఉద్దానం ప్రజలు పడుతున్న బాధలను జగన్ స్వయంగా చూసి చలించిపోయారు.తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్దానం పీడిత ప్రజల కోసం పలాసలో రూ.50 కోట్ల వ్యయంతో రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కట్టించింది జగన్ ప్రభుత్వం.దానికి ‘డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి’గా నామకరణం చేసింది.

అనంతరం కిడ్నీ వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేయించిన ప్రభుత్వం నివేదికను సిద్ధం చేయించింది.

ఏదైనా సమస్య వచ్చిన తరువాత ట్రీట్ మెంట్ చేయడం కాకుండా అసలు వ్యాధే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళికను సిద్ధం చేయించారు సీఎం వైఎస్ జగన్.కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక నుంచి ప్రతి ఒక్క పేదవానికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఉద్దానం ప్రజలెవరూ ఇకపై కిడ్నీ వ్యాధితో బాధపడకూడదనే లక్ష్యంతో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆస్పత్రిని కట్టించారు.

అలాగే ఉద్దాన ప్రాంత ప్రజల కోసం వంశధార నీరు అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్మించింది.దీని ద్వారా పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సొంపేట, కవిటి, కంచిలి మరియు ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించనుంది.

ఈ మేరకు ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు.ఈ ప్రాజెక్టును ఈనెల 14 న సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ ను శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇన్నేళ్లకు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం వైఎస్ జగన్ కృషితో ఉద్దాన వాసుల జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube