ఏపీ స్పెషల్ స్టేటస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హోదా పై  సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో గత ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడింది అని పేర్కొన్నారు.

 Cm Jagan Sensational Comments On Ap Special Status-TeluguStop.com

కానీ తమ ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాలని కోరుతున్నట్లు జగన్ స్పష్టం చేశారు.కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి హోదా ఇవ్వాలని అడగడం తప్ప ప్రస్తుతానికి ఏమి చేయలేక పోతున్నాం.

కానీ ఏదో రోజు ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ స్పష్టం చేశారు.జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తరుణంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 Cm Jagan Sensational Comments On Ap Special Status-ఏపీ స్పెషల్ స్టేటస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకానొక సమయంలో ప్రైవేటు ఉద్యోగాల కోసం ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది.కానీ అటువంటి పరిస్థితులు ప్రస్తుతం మారుతున్నాయి.మన ఉద్యోగాలు మన గ్రామాల్లోని వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అంటూ పేర్కొన్నారు.ఏదిఏమైనా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని మరోసారి జగన్ స్పష్టం చేశారు.

 

#AP CM Jagan #Ap Job Calendar #Released #Delhi #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు