విభజన హామీలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో స్వాగతోపన్యాసం ప్రారంభించిన జగన్ రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకురావడం జరిగింది.

 Cm Jagan Sensatational Comments Ys Jagan Tirupati, Ys Jagan, Amith Shah-TeluguStop.com

ఈ సందర్భంగా స్పెషల్ స్టేటస్ హామీ నెరవేర్చలేదని గుర్తు చేశారు.అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను నిర్దేశిత సమయంలో పరిష్కరించే దిశగా కేంద్రం వ్యవహరించాలని కోరారు.

అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలపై ఒక కమిటీ వేయాలని కూడా సూచించారు.విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని.విడిపోయి ఏడు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు విభజన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు.హామీలను నెరవేర్చకపోవడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్దారణ లో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.రిసోర్స్ గ్యాప్ నూ భర్తీ చేయలేదని జగన్ చెప్పారు.ఇంకా పోలవరం ప్రాజెక్టు, విద్యుత్, మరియు రుణాలు.ఇంకా అనేక విషయాల గురించి ప్రస్తావిస్తూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube