సీఎం జగన్ ‘స్పందన’ కార్యక్రమం.. కలెక్టర్లకు పలు ఆదేశాలు

ఏపీ సీఎం జగన్ ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.కరోనా వైద్యానికి కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు.

 Cm Jagan Response Program Many Orders To Collectors  Ap, Cm Jagan, Spandana Prog-TeluguStop.com

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కోవిడ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారం నిబంధనలు పాటించని, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న కోవిడ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఆస్పత్రుల్లో జాయిన్ అయిన కోవిడ్ బాధితులను అర్ధ గంటలోపూ బెడ్ అరేంజ్ చేయాలి.104, 14410 అత్యవసర సేవలకు కాల్స్ వస్తే త్వరగా రెస్పాండ్ అవ్వాలని ఆయన అన్నారు.

దీంతో పాటుగా ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల వరద ఉధృతి పెరిగింది.ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవాలి. గోదావరి వరద ముంపు బాధితులకు రూ.2 వేల అదనపు పరిహారం అందించేలా ప్రణాళిక రూపొందించండి.సెప్టెంబర్ 7వ తేదీలోగా రైతులకు జరిగిన పంట నష్టంపై అంచనా వేసి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.వీటితో పాటు రెగ్యూలర్ గా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులకు అదనంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఫామాయిల్, కేజీ ఉల్లి, కేజీ బంగాళాదుంపలు, 2 లీటర్ల కిరోసిన్ ను సెప్టెంబర్ 7 లోగా అందేలా చర్యలు తీసుకోవాలి.

’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube