బిగ్ బ్రేకింగ్: ఢిల్లీ పర్యటనకు రెడీ అయిన సీఎం జగన్..!!  

delhi,ys jagan,modi,amith shah - Telugu Amith Shah, Delhi, Modi, Ys Jagan

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు.ఈ పర్యటనలో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మరికొంతమంది కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో  విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రామతీర్థం లో జరిగిన రాముడి విగ్రహం ధ్వంసం పై అటు టీడీపీ ఇటు బీజేపీ నేతలు భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది.ఇదిలాఉంటే విగ్రహాల ధ్వంసం ఘటన లో టీడీపీ మరియు బీజేపీ పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశంలో వెల్లడించడం సంచలనం రేపింది.

దీనికి సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయం గురించి జమిలి ఎన్నికల గురించి జగన్ ఈ పర్యటనలో మోడీతో చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి సిఐడి రిపోర్ట్ ఆయన దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఏపీ రాజకీయవర్గాలలో టాక్ వినపడుతోంది.

 

#YS Jagan #Modi #Delhi #Amith Shah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు