టీడీపీ గల్లంతయ్యేలా జగన్ సరికొత్త వ్యూహం ? 

తమ పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు, తమ ప్రత్యర్థ పార్టీని ఎలా బలహీనం చేయాలనే విషయంపైనే ఆయా పార్టీల అధినేతలు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.ఏదో విధంగా ప్రత్యర్ది పార్టీలపై పై చేయి సాధిస్తే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండదని , అధికారం దక్కుతుంది అనే లెక్కల్లో ఉంటారు.

 Cm Jagan New Strategies By Encouraging Joinings Of Political Leaders From Tdp Pa-TeluguStop.com

అందుకే ఈ విషయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు.ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా గెలుపు తమదే అన్న ధీమా లో జగన్ ఉన్నారు.ఇప్పటి వరకు ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధి ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న జగన్ విజయం పై ఆ స్థాయిలో ధీమా తో ఉన్నారు.

రాజకీయ ఉద్దండుడి గా పేరుపొందిన చంద్రబాబును అంత తక్కువగా అంచనా వేయకూడదు అని జగన్ గుర్తు చేసుకుంటున్నారు.

దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను తగ్గించేందుకు జగన్ ఎత్తుగడుగు వేస్తున్నారు.దీనిలో భాగంగానే పార్టీలోకి పెద్ద ఎత్తున టిడిపి నుంచి చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని వైసిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు మరికొన్ని సర్వే సంస్థ ద్వారా ఏపీలో వాస్తవ పరిస్థితులను నివేదికల రూపంలో జగన్ తెప్పించుకున్నారు.

  వాటి ఆధారంగానే ఇప్పుడు టిడిపిని బలహీనం చేసే విషయంపై దృష్టి పెట్టారు.వైసిపికి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత లేదు.

పోటీ కూడా ఎక్కువగానే ఉండబోతుంది.అయినా టిడిపి నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని, ఆ పార్టీలో బలమైన నేతలను గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునే వ్యూహానికి జగన్ తెరితీసారు.

Telugu Ap, Chandrababu, Jagan Akarsh, Jagan, Tdp-Political

టిడిపిలో జిల్లాల వారిగా నియోజకవర్గాలు వారిగా బలమైన నేతలు ఎవరు అనే విషయాన్ని ఎప్పటికీ సర్వేల ద్వారా గుర్తించారు.గత ఎన్నికల్లో టిడిపి తరఫున  పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన వారు చాలామంది,  టీడీపీలో ఉన్నా యాక్టివ్ గా ఉండడం లేదు.వారిని గుర్తించి వైసీపీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు.బలమైన నాయకులను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా వైసిపి ఓటు బ్యాంకు పెరుగుతుందని, నేతలు కొంతమందికి టికెట్ దక్కినా మిగిలిన నాయకులకు వివిధ పదవులు ఇస్తామనే హామీ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారట.

ఈ తరహా వ్యూహాలతో టిడిపిని మరింత బలోహీనం చేయాలనేదే జగన్ అసలు ఉద్దేశమట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube