వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త!  

ap government good news to motorist, cm jagan, motorist, ap politics, good news - Telugu Ap Politics, Cm Jagan, Good News, Motorist

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జగన్ సర్కార్ అన్ని విధాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే.ఓవైపు సామాన్య ప్రజలకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసు కుంటూనే మరోవైపు కరోనా వైరస్ నియంత్రణకు… సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ సర్కార్.

 Cm Jagan Motorist Ap Politics Good News

తాజాగా వాహనదారులకు శుభవార్త వినిపించింది.మరోసారి వెహికల్ టాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

రోడ్ టాక్స్ కట్టేందుకు వాహనదారులకు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగియనుండడంతో దీనిపై పునరాలోచించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆటో టాక్సీ నడిపేవారు కష్టాల్లో ఉన్న తరుణంలో… వాహనదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు రోడ్ టాక్స్ కట్టే గడువును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే లాక్డౌన్ సమయంలో మోటార్ వెహికల్ టాక్స్ చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాస్తవంగా ఏప్రిల్ 30 వరకే టాక్స్ చెల్లింపు గడువు పూర్తవ్వాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జూన్ 30 వరకు వాహనదారులు టాక్స్ చెల్లించేందుకు అవకాశం కల్పించింది జగన్ సర్కార్.మరో సారి దీనిపై పునరాలోచించి జూలై 31 వరకు గడువు పొడిగించింది.

అయితే చెల్లింపులు గడువు ముగిసిన తర్వాత వాహనదారులు భారీ మొత్తంలో జరిమానాలు కట్టాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దీర్ఘంగా ఆలోచించి మరోసారి గడువు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

#AP Politics #CM Jagan #Motorist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cm Jagan Motorist Ap Politics Good News Related Telugu News,Photos/Pics,Images..