రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం..!

ఏపీ సీఎం జగన్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తో సమావేశం అయ్యారు.2020లో లక్ష్యాలను సాధించామని.2021లో అదే ఆశాజనకంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని ప్రభుత్వ ప్రధాన్య కార్యక్రమాలకు బ్యాంకర్లు కూడా సహకరించాలని జగన్ కోరారు.

 Cm Jagan Meeting With State Level Bankers-TeluguStop.com

రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్తగా మెడికల్ కాలేజీలు, జగనన్న కాలీల అభివృద్ధి తదితర పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నంతేకాదు కౌలు రైతులకు ఈ ఏడాది మరింత రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు.

అంతేకాదు చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణాలకు ప్రాధాన్య ఇవ్వాలని వైఎస్ జగన్ సూచించారు.రాష్ట్రానికి కావాల్సిన ఆర్ధిక వనరులను అందించేలా బ్యాంకర్లు సహకరించాలని కోరారు సీఎం జగన్.

 Cm Jagan Meeting With State Level Bankers-రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్రంలో తలపెట్టిన పనులు సమర్ధవంతంగా పూర్తి చేయడానికి బ్యాంక్ ల సపోర్ట్ ఉండాలని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కూడా పాల్గొన్నారు.

సీఎం జగన్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారని కన్నబాబు వెల్లడించారు. 2.83 లక్షల కోట్ల్ రుణ ప్రణాళికను రూపొందించారని వాటిలో 1.48 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని మంత్రి చెప్పారు.

#Bankers #CM Jagan #STATE #Level #Meeting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు