అమెరికా కార్నర్ ప్రారంభించిన సీఎం జగన్..!!

ఆంధ్ర యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన అమెరికా కార్నర్ నీ  ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉదయం ప్రారంభించారు.అమెరికా దేశంలో విద్య అదే రీతిలో ఉపాధి ఉద్యోగ అవకాశాల సమాచారం అందించే రీతిలో అమెరికా కార్నర్ నీ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లో ఏర్పాటు చేయడం జరిగింది.

 Cm Jagan Launches America Corner-TeluguStop.com

ఈ క్రమంలో  ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ ఈ కార్యాలయాన్ని  ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.

ఈ అమెరికా కార్నర్ విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.

 Cm Jagan Launches America Corner-అమెరికా కార్నర్ ప్రారంభించిన సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశంలో ఈ అమెరికా అమెరికా కార్నర్ ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాలలో మాత్రమే ఉన్నాయనిఇప్పుడు వైజాగ్ లో నెలకొల్పడం సంతోషించదగ్గ విషయం అని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు.యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులు.అమెరికన్ కాన్సులేట్ జనరల్ అధికారులు, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి ఈ అమెరికా కార్నర్ అనేది బాగా ఉపయోగపడుతుంది.

#America #CM Jagan #Andra #AP Cm #Veena Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు