ఉద్యోగ సంఘాల నేతలకు తీపి కబురు చెప్పిన సీఎం జగన్..!!

Cm Jagan Good News To Employess Union

పీఆర్సి విషయంలో గత కొద్ది నెలల నుండి ఉద్యోగ సంఘాలు కీలక సమావేశాలు నిర్వహించడం మాత్రమే కాక ప్రభుత్వ పెద్దలను కూడా కలవడం జరిగింది.అయితే వారి నుండి సరైన క్లారిటీ రాకపోవటంతో ఇటీవల ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ.

 Cm Jagan Good News To Employess Union-TeluguStop.com

ప్రకటించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

పర్యటనలో భాగంగా తిరుపతిలో జగన్ పర్యటిస్తున్న సమయంలో ఉద్యోగస్తుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్‌సీపై విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంలో వారికి సీఎం జగన్ తీపి కబురు చెప్పారు.

 Cm Jagan Good News To Employess Union-ఉద్యోగ సంఘాల నేతలకు తీపి కబురు చెప్పిన సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందనీ, పది రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపారు.

సీఎం జగన్ నేరుగా పది రోజుల్లో ప్రకటన చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఒక భరోసా లభించింది.ఇదే సమయంలో ప్రభుత్వం.ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి ఆహ్వానం పంపించడం జరిగింది.

దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నాయకులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి హజరుకావాలని అన్ని ఉద్యోగ సంఘాలకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ సమాచారం పంపారు.

ఈ క్రమంలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏ లతో సహా సుమారు 45 డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉద్యోగ సంఘాల నేతలు పెట్టనున్నట్లు సమాచారం.

#AP CM Jagan #AP #Ap Employess #AP #CmJagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube