ఏపీ విద్యార్థులపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని విద్యార్థినీ విదార్థుల కోసం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఆరు రకాల వస్తువులతో జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

 Cm Jagan Good News To Ap School Students-TeluguStop.com

ఈ కిట్ లో భాగంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, సాక్స్, బూట్లు, నోటు పుస్తకాలు, మూడు జతల యూనిఫామ్స్ ఇవ్వనుంది.

జగన్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

స్మార్ట్ టీవీల ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధన అందాలనే లక్ష్యంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.జగనన్న గోరుముద్ద పథకం గురించి కూడా జగన్ సమీక్ష జరిపారు.

రాష్ట్రంలోని విదార్థినుల కోసం జగన్ ఒక కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్ కిన్స్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పథకాన్ని మొదలుపెట్టి రాష్ట్రమంతటా అమలు చేయనుంది.విద్యార్థినులు ఒక రూపాయి వెండింగ్ మెషిన్ లో వేసి శానిటరీ నాప్ కిన్ లను పొందవచ్చు.

ఈ సంవత్సరం జూన్ నెల నుండి ఈ మిషన్లను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.ప్రభుత్వం విదార్థినీ విద్యార్థుల కోసం పలు కీలక నిర్ణయాలు ప్రకటించటం పట్ల ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube