తెలంగాణలో నివశిస్తున్న ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త!  

CM Jagan good news to AP Migrated people, AP people, Telangana, Free Rice and Dal, YS Jagan Govt, Coronavirus, lockdown, Ration Card Holders - Telugu Ap People, Cm Jagan, Coronavirus, Lockdown, Ration Card Holders, Ration Card Portability, Rice, Telangana, Ys Jagan Govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది.

TeluguStop.com - Cm Jagan Good News To Ap Migrated People

ఏపీ నుంచి తెలంగాణకు అధిక సంఖ్యలో ఉపాధి కార్మికులు వలస వెళ్లడంతో వారికి వలస వెళ్లిన వాళ్లకు ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా రేషన్ పొందే విధంగా చర్యలు చేపట్టింది.ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లు అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ ద్వారా సరుకులను తీసుకుంటున్నారు.
జగన్ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా జగన్ సర్కార్ తెలుగు రాష్ట్రాలను ఒకే క్లస్టర్ గా గుర్తించింది.ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రజలు సరుకులు తీసుకోవచ్చు.

జగన్ సర్కార్ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ నిర్ణయం సక్సెస్ అయితే మాత్రం దేశమంతటా ఇదే విధానాన్ని అమలు చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయనుంది.ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వెళ్లిన 349 మంది నూతన విధానం ద్వారా సరుకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

TeluguStop.com - తెలంగాణలో నివశిస్తున్న ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు జగన్ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం నిన్నటి నుంచి రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించింది.9.76 లక్షల మంది ప్రయోజనం పొందారని తెలుస్తోంది.1.34 లక్షల మంది ఇతర జిల్లాల్లో పోర్టబులిటీ ద్వారా ప్రయోజనం పొందారని సమాచారం.

జగన్ సర్కార్ బియ్యంతో పాటు శనగలు లేదా కంది బేడలు ఉచితంగా అందిస్తోంది.కుటుంబానికి కేజీ కంది బేడలు లేదా శనగల, ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం అందించడానికి సిద్ధమవుతోంది.1,50,80,690 బియ్యం కార్డుదారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుంది.జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#RationCard #RationCard #YS Jagan Govt #Coronavirus #CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cm Jagan Good News To Ap Migrated People Related Telugu News,Photos/Pics,Images..