ఏపీ మహిళలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.రాష్ట్రంలో శాంతిభద్రతలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Cm Jagan Gives Key Instructions To Ap Women,  Andhra Pradesh, Ys Jagan-TeluguStop.com

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో.రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా ఫోన్ లో దిశ యాప్ తప్పనిసరిగా ఉండాలని, ఆ విధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.అవగాహన కార్యక్రమాలు కల్పించాలని సూచించారు.అదే రీతిలో సైబర్ క్రైమ్.కేసులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
  రాష్ట్రంలో ఉండే పాఠశాలలు మరియు కాలేజీలు.

విశ్వవిద్యాలయాలు వంటి చోట్ల డ్రగ్స్ దొరకకుండా ఉండేలా చూడాలని కట్టుదిట్టంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని వారిలో.5 వేల మందికి పైగానే సాయం అందినట్లు.కాపాడినట్లు సీఎం జగన్కి అధికారులు వివరించారు.

ఏపీలో దిశ.ప్రత్యేక కోర్టులు అదేరీతిలో చిన్నారులపై మహిళలపై నేరాల విచారణ.నిరోధానికి తీసుకుంటున్న చర్యలు గురించి పోలీస్ ఉన్నత అధికారులు.ముఖ్యమంత్రి జగన్ కి సవివరంగా వివరించారు.ప్రత్యేకంగా మాదక ద్రవ్యాలు నిరోధం వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించటం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube