టీచర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ స్కూల్స్ లో పని చేసే టీచర్లకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు.టీచర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదవి బదీలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 Cm Jagan, Ysjaganmohanreddy , Ysrcp, Ycp, Teachers, Ap Schools, Ap-TeluguStop.com

టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్ ‌పై సీఎం జగన్ సంతకం చేశారు.టీచర్ల బదిలీలపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు రాబోతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి సమయానికి రెండేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్ నిర్ణయంతో మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు నిరీక్షణకు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ ప్రారంభయ్యే సమయానికి మౌలిక వసతులను మరింత మెరుగుపర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్కూల్స్ పై సమీక్షలు నిర్వహిస్తోంది.

పాఠశాలలను తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం వదిలేయడంతో, నవంబర్ తొలివారంలో పాఠశాలలను పునః ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్‌ లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube