ఆపరేషన్ ముస్కాన్ తో సీఎం జగన్ ఫుల్ హ్యపీ..!

కరోనా లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.ఏపీ పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తునే ఆపరేషన్ ముస్కాన్ పై ఫోకస్ పెట్టారు.

 Ap, Operation Muskan, Childrens,-TeluguStop.com

వీధి బాలలు, తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న గృహాలపై దాడి చేసి 4,806 మంది వీధి బాలలను పోలీసులు రక్షించారు.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సాఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19’ ముమ్మరంగా కొనసాగించింది.

లాక్ డౌన్ తో ఎటూ బయటకు రాలేని పరిస్థితి.దీన్ని అదునుగా భావించిన పోలీసులు ప్రభుత్వ శాఖలతో సమన్వయం పాటించి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఇప్పటి వరకూ 4,806 బాల కార్మికులను, వీధి బాలలను, తప్పిపోయిన వాళ్లను వెతికి సంరక్షించింది.రాష్ట్రంలో జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు చేపట్టి బాలలను రక్షణ కేంద్రాలను తరలించామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19లో భాగంగా ఆరో విడత ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు.డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.గత 5 విడతల కంటే.6వ విడత కార్యక్రమంలో ఒక ఎత్తని అభిప్రాయపడ్డారు.వారం రోజులు కొనసాగిన కార్యక్రమం ఎంతో సక్సెస్ ను సాధించిందన్నారు.ఆపరేషన్ ముస్కాన్ టీం పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారని డీజీపీ తెలిపారు.

వేలాది మంది పిల్లలను రక్షించి, తల్లి దగ్గరికి బిడ్డను చేర్చడం సంతోషంగా ఉందని, ఆపరేషన్ ముస్కాన్ టీంతో పాటు ఛాలెంజ్ గా పనిచేసిన సీఐడీకి, డీజీపీకీ అభినందనలు అని సీఎం జగన్ వెల్లడించారు.ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 4806 మంది బాలలను కాపాడమని, వారిలో బాల కార్మికులు 278 మందిని, 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube