టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి జగన్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సమీకరణాలు అన్ని మారిపోయాయి.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న చాలా మంది ఇప్పుడు తమ పదవులకి వరుసగా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు.

 Cm Jagan Finalises Yv Subba Reddy As New Chairman For Ttd-TeluguStop.com

అయితే టీటీడీ పాలక మండలి విషయంలో కాస్తా రచ్చ జరిగింది.టీటీడీ చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇచ్చే వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని మొండి చేయడంతో ముఖ్యమంత్రి జగన్ ఏకంగా టీటీడీ పాలక మండలిని రద్దు చేసాడు.

ఇదిలా ఉంటే టీటీడీ పాలక మండలి ఏర్పాటుపై, అలాగే చైర్మన్ నియామకంపై గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న జగన్, టీటీడీ చైర్మన్ పదవికి చాలా మంది పేర్లు పరిశీలించినట్లు తెలుస్తుంది.

ఇక ఫైనల్ గా జగన్ పాత టిటిడి పాలక వర్గాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది.అలాగే కొత్త చైర్మన్ గా ఒంగోలు ఎంపీ వై వి సుబ్బారెడ్డి నియమించారు.

కొత్త చైర్మన్ నియామకంపై అధికారిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేయాల్సి ఉంది.ఇన్ని రోజులు టిటిడి చైర్మన్ పదవి పై మోహన్ బాబు, స్వరూపానంద పేర్లు వినిపించగా చివరికి ముఖ్యమంత్రి జగన్ తన బాబాయ్ వై వి సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్ బాధ్యతలను కట్టబెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube