రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో 2019 ఎన్నికల టైంలో అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే రీతిలో పరిపాలన అందిస్తున్నారు.

 Cm Jagan Deposited Money In Farmers' Accounts Ys Jagan, Raithu Barosa Kendram, C-TeluguStop.com

దాదాపు రెండు సంవత్సరాల పదవీ కాలంలో మేనిఫెస్టోలో 90శాతం హామీలు నెరవేర్చిన జగన్ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు.మేటర్ లోకి వెళ్తే రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం ఈరోజు అందించారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో రైతులు ఎవరు కూడా ఇబ్బందులకు గురికాకూడదు అని జగన్ తెలిపారు.దాదాపు 52 లక్షలకు పైగా ఉన్న రైతుల ఖాతాల్లోకి… 3928.88 కోట్ల సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.రూ.13500లు మూడు విడతలుగా అందజేస్తున్నట్లు.కౌలు రైతులకు కూడా భరోసా సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంత మాత్రమే కాక దేవాదాయ శాఖ భూములు సాగుచేస్తున్న కౌలు రైతులకు కూడా.ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

రైతు భరోసా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి  13101 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు .రెండు సంవత్సరాల పాలనలో అనేక కార్యక్రమాలు చేపడుతూ దాదాపు రైతులకు 68 వేల కోట్ల సాయం.రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ డబ్బులు జమ చేయటంతో ఏపీ రాష్ట్ర రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube