సీబీఐకి అంతర్వేది రథం దగ్దం కేసు

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ప్రముఖ లక్ష్మినరసింహస్వామి వారి కళ్యాణ రథంను గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేయడంతో గత రెండు మూడు రోజులుగా అంతర్వేది రణరంగం అవుతోంది.బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.

 Cm Jagan Decides To Move For Cbi Enquiry Antarvedi Chariot Incident, Ap Cm Jagan-TeluguStop.com

ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలపై దాడులు పెరగడంతో పాటు హిందువుల అస్థిత్వంను చెడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ విమర్శలు చేయడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనకు కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించే నిర్ణయం తీసుకుంది.

అందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ అవ్వబోతున్నాయి.జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తో పాటు బీజేపీ నాయకులు మరియు ఇతర హిందుత్వ నాయకులు అంతా కూడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆందోళనలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.అంతర్వేదిలో జరిగిన ఈ సంఘటనతో దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యింది.బీజేపీ ఈ విషయంలో చాలా సీరియస్‌ గా ఆందోళనలు చేస్తుండగా ఇతర పార్టీలు కూడా గోదావరి జిల్లాలో ఆందోళనలు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube