కాశ్మీర్ లో ఏపీకి చెందిన జవాన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..!!

ఇటీవల కాశ్మీర్ లోయలో బస్సు ప్రమాద ఘటనలో ఏడుగురు జవాన్ లు మరణించడం తెలిసిందే.అయితే వీరిలో అన్నమయ్య జిల్లా సాంబేపల్లి మండలం దేవపట్లకు చెందిన జవాన్ దేవరింటి రాజశేఖర్ కూడా మృతిచెందినట్లు బంధువులకు సమాచారం అందింది.

 Cm Jagan Condoles Death Of Jawan From Ap In Kashmir Ap Cm Jagan, Jawan Raja Sekhar, Itbp, Buss Accident-TeluguStop.com

బద్రీనాథ్ బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తున్న పయనంలో ఇండో టిబిటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబిపి) బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఏపీకి చెందిన జవాన్ రాజశేఖర్ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు సమాచారం అందించారు.

రాజశేఖర్ గత 12 సంవత్సరాలు నుండి ఐటీబిపిలో విధులు నిర్వహిస్తున్నారు.ఇటీవల రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్ళటం జరిగింది.

 CM Jagan Condoles Death Of Jawan From AP In Kashmir AP CM Jagan, Jawan Raja Sekhar, ITBP, Buss Accident-కాశ్మీర్ లో ఏపీకి చెందిన జవాన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతలోనే రాజశేఖర్ మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు.రాజశేఖర్ భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ క్రమంలో జవాన్ రాజశేఖర్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube