20 తర్వాత సడలింపులు.. కర్ఫ్యూ కొనసాగుతుందన్న సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.కొవిడ్ వ్యాప్తి కట్టడి, హెల్త్ క్లీనిక్స్, ఉపాది హామీ, ఇళ్ల పట్టాలు, ఖరీఫ్ కు రెడీ అవడం తదితర అంశాలపై చర్చలు నిర్వహించారు.

 Cm Jagan Collector Conference Covid Situation In Ap State,cm Jagan, Covid Situat-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతుందని తెలిపారు.

అయినా సరే ఈ నెల 20 తర్వాత కూడా కొన్ని సడలింపులులతో కూడిన కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేలా అధికారులను నిర్ధేశించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 69 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని, 26 లక్షల 33 వేల మందికి రెండు డోస్ లు ఇచ్చామని తెలిపారు.గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో కొవిడ్ చికిత్స ఆరోగ్య శ్రీ కిందకి తెచ్చామని 89 శాతం మంది కరోనా బాధితులు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందారని జగన్ చెప్పారు.ఏపీలో పిల్లల కోసం 3 కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తునంట్టు వెల్లడించారు.

వైజాగ్, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో ఉంటాయని చెప్పారు.కరోనా థర్డ్ వేవ్ పై కూడా జగన్ చర్చించారు.

థర్డ్ వేవ్ వస్తే అందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube