రైతులకు శుభ వార్త చెప్పిన కేసీఆర్...అదేంటంటే?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ వస్తోంది.ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఏర్పడడానికి ఆ మచ్చ పోవడానికి చాలా కృషి చేయవలసి వచ్చిందని చెప్పవచ్చు.

 Telangna Cm Kcr Good News To Farmers, Kcr, Farmers, Rice, Rythu Bheema, Free Cur-TeluguStop.com

తెలంగాణ ఏర్పడ్డ తరువాత సంక్షేమం, వ్యవసాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన కేసీఆర్ తరువాత రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రాయితీ రూపంలో రైతులకు పనుముట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా చాల రైతు ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.అయితే వ్యవసాయంలో వినూత్న మార్పుల దిశగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.

తెలంగాణ భూములు అత్యంత సారవంతమైనవి కావడంతో మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జిస్తారనేది ప్రభుత్వ ఆలోచన.అయితే కేసీఆర్ తాజాగా రైతులకు శుభ వార్త తెలిపాడు.

యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా గత సంవత్సరం లాగే పూర్తి స్థాయిలో గ్రామాల్లో కొనుగోలు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.అయితే ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే బ్యాంకులతో 20 వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చినట్లు కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube