చంద్రబాబు దెబ్బకి...జగన్ “మైండ్ బ్లాక్”   CM Chandrababu Shocking Decision     2018-04-11   00:46:58  IST  Bhanu C

వ్యుహాలకి ప్రతి వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు ని మించిన చాణిక్యుడు లేరనే చెప్పాలి..ఆట మొత్తం ఆడనిచ్చి చివరికి వచ్చే సరికి గెలుపు మాత్రం చంద్రబాబు పట్టుకెళ్ళి పోతారు..అయితే ప్రత్యేక హోదా మా హక్కు మాకు హోదా కావాలి అని గత కొన్ని రోజులుగా వైసీపి ఆడుతున్న డ్రామాలు అన్ని ఇన్నీ కావు…తమ ఎంపీలతో రాజీనామాలు చేయించిన విషయం అందరికీ తెలిసిందే అయితే వైసీపి మేము ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని అనిపించుకోవడానికి నిరాహారా దీక్షలు చేస్తూ ఏపీ పజల ముందు ఓ రేంజ్ లో నటిస్తోంది..


అయితే..వై “ఛీ”పై చేస్తున్న దీక్షలు ప్రజలలోకి వెళ్లే లోగానే బాబు తన అపర చాణక్యతను ఉపయోగించి…జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు..ఎప్పటికప్పుడు సమయాన్ని, పరిస్థితిని సమీక్షించుకుంటూ ఆచితూచి అడుగువేస్తున్న చంద్రబాబు జగన మైండ్ బ్లాక్ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు..అదేంటంటే ఢిల్లీలో హోదాపై పోరాడుతున్న తన ఎంపీలను రాష్ట్రానికి తిరిగి వచ్చేయాలని బాబు ఆదేశాలు పంపించారు..

అయితే బాబు ఈ నిర్ణయంతో జగన్ కి టిడిపి వేసిన ప్లాన్ అర్థం కాలేదు..అసలు చంద్రబాబు తన ఎంపీలని ఎందుకు వచ్చేయమని చెప్పారు అని ఆలోచించడానికి జగన్ కి అసలు అంతుబట్టలేదు..కానీ అసలు విషయం ఏమిటంటే కేంద్రం లో ఎన్ని నిరసనలు తెలిపినా సరే అవి గాలికి కొట్టుకు పోతాయి పెద్దగా ఫలితం ఉండదు అయితే ఈ నిరసనలు ఏవో ఏపీ ప్రజల ముందు చేస్తే కనీసం మంచి ఫలితం ఉంటుంది అనేది చంద్రబాబు ప్లాన్..

ఈ క్రమంలోనే తమ ఎంపీలకి కబురు పంపిన చంద్రబాబు ఏపీ ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం అని డిసైడ్ అయ్యారు…అంతేకాదు రాష్ట్రంలో ఎంపీలతో బస్సు యాత్ర బస్సు యాత్ర మొదలు పెట్టి ఏపీ కి బీజేపి చేసిన మోసాన్ని ఊరూరా తెలియచేయాలని డిసైడ్ అయ్యారట..అందుకు తగ్గట్టుగా రూట్ మ్యాప్ కూడా తయారు చేశారని తెలుస్తోంది..అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో జగన్ కి దిమ్మ తిరిగిపోయింది..అసలు ప్రత్యేక హోదాపై గొంతు ముందు వినిపించింది జగన్ అయితే చివరికి ఆ క్రెడిట్ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు..ఇప్పుడు జరుపబోయే బస్సు యాత్రతో మొత్తం ఉద్యమాన్ని తవైపుకి తిప్పుకుని ఏపీ ప్రజల దృష్టిలో చంద్రబాబు హీరో అవ్వడం మాత్రం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..