ఆ మంత్రిని చంద్రబాబు పీకేస్తార‌ట‌..!     2016-12-25   22:19:07  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లో ల‌క్‌తో బెర్త్ కొట్టేసిన ఓ మంత్రి ప‌దే ప‌దే కాంట్ర‌వర్సీల్లో చిక్కుకుని పార్టీ ప‌రువుతో పాటు ప్ర‌భుత్వ ప‌రువును బ‌జారుకు ఈడుస్తున్నారు. ఈ మంత్రికి ఇప్ప‌టికే రెండుమూడుసార్లు వార్నింగ్ ఇచ్చిన చంద్ర‌బాబు కొత్త యేడాదిలో ఇంటికి పంపించేందుకు ప్లాన్ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారిగా పోటీ చేసి విజ‌యం సాధించారు రావెల కిషోర్‌బాబు.

సామాజిక‌వ‌ర్గ కోటాలో ఆయ‌న అనూహ్యంగా బాబు కేబినెట్‌లో బెర్త్ ద‌క్కించుకున్నారు. రావెల మంత్రి అయ‌న‌ప్ప‌టి నుంచి ఆయ‌న వ‌రుస‌గా వివాదాల‌కు కేరాఫ్‌గా మారిపోయారు. బీజేపీతో పొత్తుపై కాంట్ర‌వర్సీ కామెంట్లు చేసిన రావెల బాబుతో తిట్లు తిన్నారు. ఆ త‌ర్వాత రావెల నియోజ‌క‌వ‌ర్గంలో త‌న గెలుపు కోసం కృషి చేసిన నాయ‌కుల‌ను పూర్తిగా విస్మ‌రించ‌డంతో రావెల‌పై వారంతా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

రావెల ఇద్ద‌రు కుమారుల‌పై మ‌హిళ‌ల‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం, లేడీస్ హాస్ట‌ల్లో చొర‌బ‌డ‌డం లాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్పుడు కూడా అవి పార్టీకి మ‌చ్చ తెచ్చాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌ట‌కీ రావెల త‌న‌ను క‌లిసేందుకు వ‌స్తోన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌ను సైతం గౌర‌వించ‌డం లేద‌ని వారంగా మంత్రిపై ర‌గిలిపోతున్నారు. తాను ఇప్ప‌ట‌కీ ఓ అధికారిగా ఫీల్ అవుతున్నార‌ని… ప్ర‌జా ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ వివాదాలు ఇలా ఉండగానే ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాధినిత్యం వ‌హిస్తోన్న జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ జానీమూన్‌తో వివాదంతో మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. ఈ వివాదంలో జానీమూన్ ఏకంగా మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ మంత్రిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం స్టేట్ వైడ్‌గా సంచ‌ల‌న‌మైంది. చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు ఈ వివాదంపై త్రీ స‌భ్య క‌మిటీ వేసి ఇష్యూను క్లోజ్ చేయించారు.

వ‌రుస వివాదాల‌తో పార్టీకి, ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారిన రావెల‌ను కొత్త యేడాదిలో జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌ప్పించేయాల‌న్న నిర్ణ‌యానికి బాబు వ‌చ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లోనే డిస్క‌ర్ష‌న్ న‌డుస్తోంది. బ‌హుశా సంక్రాంతి త‌ర్వాత జ‌రిగే విస్త‌ర‌ణ‌లో రావెలను కేబినెట్ నుంచి ఇంటికి పంపే ఛాన్సులు ఉన్నాయి.