టీడీపీ రాజకీయ వారసత్వం జూనియర్ ఎన్టీఆర్ అందుకోడా  

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వారసుడు కాకుండా అడ్డుపడుతున్న బాబు. .

Cm Chandrababu Not Interested To Promote Junior Ntr-nandamuri Family,not Interested,promote Jr Ntr,tdp,telugu Desam Party

స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆ ఫ్యామిలీని దాటిపోయి వచ్చి నారా వారి చేతిలో ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన తరువాత పార్టీకి వారసుడుగా తన కొడుకు లోకేష్ ని చేయాలో వ్యూహంతో ముందుకి వెళ్తున్నాడు. ఇక లోకేష్ కూడా రాజకీయంగా తండ్రిని గురువుగా భావించి ఓనమాలు దిద్ది తన సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేతున్నారు అయితే తండ్రి స్థాయిలో రాజకీయ పరిజ్ఞానం, వ్యూహ చతురత లోకేష్ లో లేవనేది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలలో కూడా వినిపించే మాట..

టీడీపీ రాజకీయ వారసత్వం జూనియర్ ఎన్టీఆర్ అందుకోడా-CM Chandrababu Not Interested To Promote Junior NTR

ఇక తెలుగు దేశం పార్టీ వెంట తరాలుగా నడుస్తున్న చాలా మంది ఆ పార్టీకి భవిష్యత్తు వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తున్నారు. తాతకి తగ్గ మనవడుగా, నందమూరి ఫ్యామిలీలో అందరికంటే ఎక్కువ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడుగా తారక్ ప్రశంసలు అందుకుంటున్నాడు. గతంలో చంద్రబాబు కూడా తారక్ ని ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకున్నాడు.

ఆ సమయంలోనే తన రాజకీయ పరిజ్ఞానం ఎ స్థాయిలో ఉంది అనే విషయం తారక్ నిరూపించుకున్నాడు. తెలుగు దేశం వారసుడుగా అందరితో అనిపించుకున్నాడు.

అయితే తెలుగు దేశం పార్టీ తన చేయి దాటిపోవడం ఇష్టం లేని బాబు తారక్ ని మెల్లగా పక్కకి తప్పించి ఆ ప్లేస్ లోకి తన కొడుకు లోకేష్ ని తీసుకొచ్చి పెట్టాడు. రాజకీయంగా తారక్ కి ఎదిగే అవకాశం లేకుండా చేసేసాడు.

ఇక చంద్రబాబు జిత్తులు తెలిసిన తారక్ కూడా ఇక రాజకీయాల జోలికి పోకుండా తన సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్, చరిష్మా ఇంకా పెరిగింది అని చెప్పాలి. అదే టైంలో చంద్రబాబు కూడా రాజకీయ కురువృద్ధుడుగా మారిపోతున్నాడు..

ఇక ఇలాంటి టైంలో తెలుగు దేశం పార్టీ మనుగడ సాగించాలంటే కచ్చితంగా బలమైన నాయకత్వం కావాలనేది చాలా మంది కార్యకర్తల ఆలోచన. ఇక తారక్ కి టీడీపీ పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఇదే సరైన సమయం అని కూడా చాలా మంది నమ్ముతున్నారు. ఒక వేళ తారక్ ని కాదంటే ఆల్టర్నేటివ్ గా బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి అయితే తెలుగు దేశం పార్టీని సమర్దవంతంగా నడిపించగలరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.