“కొడాలి నాని” పై పోటీకి...“చంద్రబాబు” ఎవరిని దించుతున్నారో తెలుసా..?     2018-04-02   03:48:25  IST  Bhanu C

కొడాలి నాని కృష్ణా జిల్లా రాజకీయాలలో నానికి పేరు మారు మొగిపోతూ ఉంటుంది..కృష్ణ జిల్లా గుడివాడ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే గా నాని గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే వైసీపిలో రాక ముందు నాని తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలక మైన వ్యక్తిగా ఉండేవారు…చంద్రబాబు తో వచ్చిన విభేదాలు కారణంగా టిడిపి ని వదిలేశారు..అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్భలంతోనే నాని వైసీపి లోకి వెళ్ళారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది.ఇదిలా ఉంటే..తెలుగుదేశం పార్టీ కి కంచుకోటలా ఉండే గుడివాడ నానీ రూపంలో చేయి జారి పోవడంతో ఎలా అయినా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా ఎగురవేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది..అయితే..

గత ఎన్నికల్లో తెలుగు దేశం నిర్లక్ష్యం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గెలుపు పోగొట్టుకున్నా..ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేయలేదు..ఇప్పుడు అక్కడ సమర్ధం అయిన నాయకత్వ లేమితో తెలుగు దేశం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చెయ్యాలి అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ సీట్ కోసం టిడిపిలో ఎంతో మంది పోటీ పడుతున్నా సరే చంద్రబాబు మాత్రం ఈ సారి ఆచి తూచి అడుగు వేయనున్నారని తెలుస్తోంది.. గత ఎన్నికల్లో పోటి చేసిన రావి వెంకటేశ్వర రావు, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివసరావు, పిన్నమనేని కుటుంబ సభ్యులు ఉన్నారు…నాని పై పోటీ చేసే లిస్టు లో ఉన్నారు.

-
అయితే తాజాగా మరొకరి పేరు తెరమీదకి వచ్చింది..ఆ వ్యక్తి ఎవరో కాదు మాగంటి రూప.. అనూహ్యం గా మరొక పేరు తెర మీదకి వచ్చింది, ఆ పేరు మాగంటి రూప..ఈమే ఎవరో కాదు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు..మురళీ మోహన్ ప్రస్తుతం వయసు రీత్యా ఈ సారి పోటీ చేసే అవకాశం లేదు అనడంతో మెల్లెగా ఆమె రాజమండ్రి లో కార్యకర్తలతో మమేకం అవుతూ పట్టు పెంచుకుంటున్నారు.. నియోజకవర్గాలలో కలియ తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉన్నారు అయితే..అనూహ్యం గా గుడివాడ నుంచి పోటి చెయ్యమని అధిష్టానం సూచించిందట..

చంద్రబాబు ఈ నిర్ణయం ఏందుకు తీసుకున్నారంటే.. రూప పుట్టిల్లు గుడివాడ నియోజకవర్గం కావటంతో పాటు నాయకత్వ లక్షణాలు రూపాలో ఎన్నో ఉన్నాయని..గుడివాడ ప్రజలని తప్పకుండా రూప తనవైపుకి తిప్పుకుంటారు అనే నమ్మకం చంద్రబాబు కి కలిగిందట దాంతో రూపని గుడివాడలో యాక్టివ్ గా ఉండమని ఆదేశాలు వెళ్ళాయట..నాని ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండటం..అంతేకాక ప్రజలలో వ్యతిరేకత పెరగడంతో మాగంటి కోడలికి ఇవన్ని కలిసొస్తాయని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆమెని వరిస్తుందనే నమ్మకం ఉందనేది పార్టీ వర్గాల అభిప్రాయం..అయితే రూప కూడా ఇప్పటికే గుడివాడలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిందని టాక్ వినిపిస్తోంది..మరి నాని ని డీ కొట్టే సత్తా మాగంటి కోడలికి ఉందా లేదా అనేది ముందు ముందు తెలియనుంది..

ఆర్ధికం గా కూడా బాగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. అందుకే మాగంటి వారి కోడలైన రూపా అయితే నెమ్మది గా ఉండటం, రాజకీయాల అవగాహన ఉండటం, అధిష్టానం ఆసేసూలు ఉండటం తో రూపా కన్ఫర్మ్ అయినట్టే అని చెప్తున్నారు. ఒక వేళ రూప అయితే గెలిచే అవకాశాలు బావున్నాయని తెలుస్తుంది. రావి వెంకటేశ్వర రావు కి, యలవర్తి కి టికెట్ లేదు అని గుడివాడ లో వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా పిన్నమనేని కి మాగంటి కి మధ్య మాగంటి కి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.