మోడీ కి సవాల్ విసిరిన చంద్రబాబు   CM Chandrababu Naidu Fires On PM Narendra Modi     2018-04-06   06:23:45  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యుహాలకి పదును పెడుతున్నారు..ప్రత్యర్ధి వ్యుహాలకి ప్రతి వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు అంచనాలని ఒడిసి పట్టే వాళ్ళు ఇప్పటి వరకూ ఏపీ రాజకీయ చరిత్రలో లేరని అంటున్నారు విశ్లేషకులు..అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ పర్యటన తరువాత చంద్రబాబు నాయుడు తన ఫంధాని పూర్తిగా మార్చేశారు..మోడీ కి దిమ్మరిగిపో హెచ్చరికలు చేస్తున్నారు. అయితే జగన్ లా కేసులకి బయపడి ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టే వ్యక్తిత్వం కాదు కాబట్టి చంద్రబాబు రొమ్ము విరుచుకుని నిలబడ్డారు.. ఎవరూ ఊహించని విధంగా అందరికి షాక్ ఇస్తూ ఢిల్లీ లో మోడీ ని ఏకి అవతల పడేసారు.

కేంద్రంపై మా హక్కుల కోసం సలిపిన ఈ పోరు కేవలం సాంపిల్ మాత్రమె ముందు ముందు ఇంకా ఉంది ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం అంటూ మోడీ కి హెచ్చరిక జారీ చేశారు చంద్రబాబు..ఇదిలాఉంటే శుక్రవారం అమరావతిలోని వెంకట పాలెం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్ యాత్రను స్వయంగా సైకిల్ నడుపుతూ ప్రారంభం చేశారు..ఆ తరువాత ప్రజలని ఉద్దేశించి మాట్లాడిన బాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు…ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటోందని, ఇదెంతో దుర్మార్గమని చెప్పారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినపుడు కేంద్రం మెడలు వంచిన చరిత్ర తమందని అన్నారు..ఎపీని రెండుగా చీల్చినందుకే కాంగ్రెస్ ఇప్పటికీ మట్టి కొట్టుకు పోయిందని ఇక మీదట కాంగ్రెస్ ఏపీలో బతికే పరిస్థితి లేదని ఇప్పుడు బిజెపి కి కూడా అదే పరిస్థితి వచ్చిందని అన్నారు చంద్రబాబు..


తెలుగు ప్రజలతో పెట్టుకునే కాంగ్రెస్ కి పట్టిన గతికంటే అధికంగానే బీజేపి నష్టపోతుందని వార్నింగ్ ఇచ్చారు..ఎంతో మంది రైతులు రాజధాని కోసం భూములు ఇస్తే..కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, ఇది దారుణమైన విషయమని విమర్శించారు…అయితే ఢిల్లీ నుంచీ తిరిగి వచ్చిన చంద్రబాబు పెద్ద ఎత్తులో మోడీ పై విమర్సనాస్త్రాలు వేయడం వెనుక ఎదో వ్యూహం ఉందని అందుకే చంద్రబాబు ఎంతో తెలివిగా వ్యవహరించారని అంటున్నారు..ఏది ఏమైనా సరే దేశంలో ఒక ప్రధానిని ఎదిరించి నిలబడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయడు ఒక్కరే అనడం లో సందేహం లేదు..