అంత కోపం ఎందుకమ్మా ! నవ్వులపాలవుతున్న ఏపీ సీఎం ..?   CM Chandrababu Fires On Governor Narasimhan Over Attack On YS Jagan     2018-10-26   15:04:47  IST  Sai M

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు.నిన్నఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద జరిగిన దాడి నేపథ్యంలో అన్ని వేళ్ళూ టీడీపీ వైపు చూపిస్తుండడంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా జగన్ కు పరామర్శలు రావడం, పనిలోపనిగా టీడీపీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం ఇవన్నీ చంద్రబాబులో అసహనం మరింత పెంచుతున్నాయి. కేసీఆర్, గవర్నర్, పవన్ వీరంతా జగన్ ను పరామర్శించడం పై బాబు విమర్శలు చేయడం ఆయనలో ఉన్న అసహనాన్ని తెలియజేస్తున్నాయి.

తాజాగా… జగన్ పై జరిగిన కత్తి దాడి వ్యవహారంపై … చంద్రబాబు శుక్రవారం ఉదయం స్పందించిన తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. ఈ ఘటన అనంతరం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీరును చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఏపీ డీజీపీకి ఫోన్ చేసి గవర్నర్ ఈ విషయం గురించి ఆరా తీశాడు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని తప్పుపడుతున్నాడు. తన అనుమతి లేకుండా గవర్నర్ డీజీపీకి ఎలా ఫోన్ చేస్తాడు? అంటూ బాబు వితండ వాదం చేస్తున్నారు. దాడి జరిగింది రాష్ట్ర ప్రతిపక్ష నేత మీద. ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే అంశాల గురించి ఆరా తీయాల్సిన బాధ్యత సహజంగానే గవర్నర్ మీద ఉంటుంది. ఆ మేరకు సమాచారం కోసం ఏపీ డీజీపీకి ఫోన్ చేశాడు గవర్నర్.

CM Chandrababu Fires On Governor Narasimhan Over Attack YS Jagan-

అయితే… చంద్రబాబుకు ఇదే తప్పు గా కనిపిస్తోంది. అంటే చంద్రబాబు అనుమతి లేనిది ఎవరూ ఏపీ డీజీపీతో మాట్లాడకూడదా? మాట్లాడింది మరెవరో కాదు.. రాష్ట్ర గవర్నర్! మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర విధానాల్లో నిర్ణయాధికారం ముఖ్యమంత్రిదే అయినా.. అది అంతా గవర్నర్ పేరు మీదే జరుగుతుంది. కానీ బాబు మాత్రం సర్వం నేనే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బాబు సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది కానీ ఇలా సమయం సందర్భం లేకుండా చౌకబారు మాటలు మాట్లాడితే జనాల్లో పలచనవ్వడం తప్ప కలిగే ప్రయోజనం ఉండదు.