మేము అడిగిన చోట రీపోలింగ్‌ పెట్టరేం?

ఏపీలో ఇటీవలే పూర్తి అయిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల రీపోలింగ్‌ కావాలంటై వైకాపా మరియు టీడీపీలు డిమాండ్‌ చేస్తున్నాయి.చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలంటూ వైకాపా ఈసీని కోరింది.

 Cm Chandra Babu Naidu Fire On Ec-TeluguStop.com

అయితే ఈసీ మాత్రం అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఓకే చెప్పింది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సమయంలోనే తెలుగు దేశం పార్టీ ఈసీపై తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, వాటన్నింట్లో కూడా పోలింగ్‌ నిర్వహించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశాడు.

తెలుగు దేశం పార్టీ నాయకులు ఇప్పటికే పలువురు ఈసీకి ఈ విషయమై ఫిర్యాదు చేశారు.అయితే ఈసీ మాత్రం కేవలం అయిదు పోలింగ్‌ బూత్‌లలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.

ఎన్నికల కమీషన్‌ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.తెలుగు దేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదలను ఈసీ కనీసం పరిశీలించేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని, వైకాపా డిమాండ్‌ చేసిన చోట మాత్రం ఎందుకు రీ పోలింగ్‌ పెడుతున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించాడు.

టీడీపీ నేత కళా వెంకట్రావు ఇప్పటికే ఈసీ ఈ విషయమై కలిసి విజ్ఞప్తి చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube