పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్‎ను ప్రారంభించిన సీఎం..!

విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‎లను అందించడమే లక్ష్యంగా పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్‎ను రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం అమరీందర్ సింగ్ విద్యార్థులకు స్వయంగా స్మార్ట్ ఫోన్‎లను అందజేశారు.

 Punjab, Cm Amarinder Singh, Punjab Smart Connect Scheme, Smart Phones-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 26 చోట్ల స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.కరోనా నేపథ్యంలో 2020 నవంబర్ నాటికి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం ద్వారా 1.74 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్‎లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు వ్యయం చేస్తుంది.

ఈ సందర్భంగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.

ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలను ప్రతి ఒక్కటిని అమలు చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్లు చదువుకునేందుకు అవసరంగా మారినందుకు పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు.

మార్చిలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని భావించామని, కానీ కొవిడ్ వ్యాప్తి కారణంగా ఆలస్యం అయినట్లు అమరీందర్ సింగ్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube