జిడ్డు చ‌ర్మానికి ల‌వంగం నూనెతో చెక్‌.. ఎలా ఉప‌యోగించాలంటే?  

జిడ్డు చ‌ర్మం లేదా ఆయిలీ స్కిన్.కాలంతో సంబంధం లేకుండా అన్ని సీజ‌న్స్‌లోనూ కొంద‌రిని ఈ స‌మ‌స్య తెగ ఇబ్బంది పెడుతుంటుంది.ఫేస్‌ క్రీములు, పౌడర్స్‌ ఇలా ఏదైనా ముఖానికి రాసినప్పుడు.వెంట‌నే ‌జిడ్డులా కారిపోతూ ఉంటుంది.ఇక ముఖాన్ని వాట‌ర్‌తో క్లీన్ చేసుకున్నా.కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే చ‌ర్మం జిడ్డుగా మారిపోతుంటుంది.

TeluguStop.com - Clove Oil Helps To Get Rid Of Oily Skin

అయితే ఇలాంటి వారికి ల‌వంగం నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ల‌వంగం నూనెలో ఉండే కొన్ని పోష‌కాలు.

జిడ్డు చ‌ర్మాన్ని దూరం చేసి ముఖాన్ని తాజాగా మారుస్తుంది.

TeluguStop.com - జిడ్డు చ‌ర్మానికి ల‌వంగం నూనెతో చెక్‌.. ఎలా ఉప‌యోగించాలంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ల‌వంగం నూనెను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ల‌వంగం నూనె మ‌రియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

బాగా ఆరిపోనివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే.ల‌వంగం నూనెలో ఉండే విటమిన్లు, మిన‌ర‌న్లు మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో అదనపు నూనెను సులువుగా తొల‌గించి.

ముఖాన్ని తాజాగా మారుస్తుంది.

ఇక ల‌వంగం నూనెతో మ‌రిన్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

క‌ళ్ల కింత న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను త‌గ్గించ‌డంలో ల‌వంగం నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ల‌వంగం నూనెను కొద్దిగా తీసుకుని.

కంటి లోప‌ల‌కు తాక‌కుండా చుట్టూ అప్లై చేయాలి.ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే.

న‌ల్ల‌టి వ‌ల‌యాలు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

శిరోజాల‌కు కూడా ల‌వంగం నూనె ఉప‌యోగ‌పడుతుంది.

హెయిర్ ఫాల్‌తో బాధ ప‌డుతున్న వారు ల‌‌వంగం నూనెను కేశాల‌కు బాగా ప‌ట్టించి.కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు శిరోజాలు బ‌లంగా, దృఢంగా ఎదుగుతాయి.అలాగే బ‌ట్ట‌త‌ల ఉన్న వారు వెంట్రుకలు లేని ప్రదేశంలో ఈ ల‌వంగం నూనె రాస్తే.

మ‌ళ్లీ కొత్త జుట్టు వ‌స్తుంది.

#Clove Oil #Oily Skin #Cloves #Beauty #BenefitsOf

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Clove Oil Helps To Get Rid Of Oily Skin Related Telugu News,Photos/Pics,Images..