ప్రపంచంనికి అడ్డుకోలేని ముప్పు పొంచి ఉందా  

Climate Crisis Has Reached Point Of No Return-climate Crisis,reached Point Of No Return,un Chief

రోజురోజు పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మనకి తెలియకుండానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని మనకు మనమే వినాశనం వైపు నడిపిస్తున్నాం.మన అవసరాలని తీర్చుకునే క్రమంలో సృష్టిస్తున్న కాలుష్యం వాతావరణాన్ని విషపూరితంగా మార్చేసి తిరిగి మన ప్రాణమే తీసేలా తయారు చేస్తున్నాం.అయితే ఈ కాలుష్యం కారణంగా వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులపై ఐక్యరాజ్యసమితి ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలని హెచ్చరిస్తుంది.

Climate Crisis Has Reached Point Of No Return-climate Crisis,reached Point Of No Return,un Chief Telugu Viral News Climate Crisis Has Reached Point Of No Return-climate Reached Return Un Chief-Climate Crisis Has Reached Point Of No Return-Climate Reached Return Un Chief

ఈ ముప్పుని ఆపడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.అయితే అమెరికాలాంటి అగ్రదేశాలు వాతావరణ మార్పులపై తీసుకొచ్చిన పారిస్ ఒప్పందంలో భాగం కావడానికి ముందుకి రావడం లేదు.

ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులతో మనం ‘అడ్డుకోలేని ముప్పు’ కనుచూపు మేరలో పొంచి వున్నదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.వాతావరణ మార్పుల సదస్సులో ఆయన మాట్లాడుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్న గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌ల విడుదలను కట్టడి చేయటంలో అగ్రరాజ్యాల వైఫల్యాన్ని ఆయన విమర్శించారు.

కాలుష్య నియంత్రణ దిశగా అగ్రరాజ్యాలు చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదని అన్నారు.అగ్రరాజ్యాలంటూ ఆయన అమెరికా పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు చేశారు.ఇక పారిస్‌ ఒప్పంద రూపకర్త, యూరోపియన్‌ క్లైమెట్‌ ఫౌండేషన్‌ సిఇఓ లారెన్స్‌ టుబియానా కొన్ని దేశాలను ప్రస్తావించారు.చైనా, జపాన్‌ వంటి కొన్ని దేశాలు ఈ కాలుష్యకారకాల కట్టడికి విముఖత విముఖత వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.