ఇకపై ఆరునెలలపాటు ఆ బ్యాంకు నుండి ఖాతాదారులు డబ్బులు తీసుకోలేరు.. ఎందుకంటే..?!

తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఆ బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న బలహీనమైన ఆర్థిక పరిస్థితిని గ్రహించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

 Clients Can No Longer Withdraw Money From That Bank For Six Mont Because ,people-TeluguStop.com

రాబోయే ఆరు నెలల పాటు బ్యాంకు కు సంబంధించి డిపాజిట్ల స్వీకరణ పై అలాగే కొత్త రుణాలను బ్యాన్ విధిస్తున్నట్లు ఆర్బిఐ నిర్ణయం తీసుకుంది.

తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో ఆ బ్యాంకు సంబంధించిన ఖాతాదారులు తమ అకౌంట్ లోని డబ్బును ఆరునెలలపాటు ఉపసంహరించుకోలేరు.

పీపుల్స్ కోపరేటివ్ బ్యాంకు కు సంబంధించి ఎటువంటి నిధులను తీసుకునేందుకు ఏ ఖాతాదారునికి లభించదని ఆర్బిఐ ఓ ప్రకటనలో తెలియజేసింది.గత సంవత్సరం జూన్ 10 తర్వాత జరిగిన లావాదేవీలపై కూడా ఈ నిషేధం వర్తిస్తుందని ఆర్బిఐ స్పష్టం చేసింది.

Telugu Bank, Loans-Latest News - Telugu

ఈ బ్యాంకు సంబంధించి నిర్ణయాన్ని పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంకు పై తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది ఆర్బిఐ.ఈ బ్యాంకులో వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఆ బ్యాంకు రుణం ఇవ్వలేదని ఆర్బిఐ సూచించింది.అంతేకాదు పాత బకాయిలను పునరుద్ధరించే అవకాశం కూడా లేకుండా పోయింది.కేవలం బ్యాంకు లో ఉన్న సొమ్మును బయటికి ఇవ్వడం మాత్రమే కాకుండా ఎవరైనా ఆ బ్యాంకులో కొత్త పెట్టుబడులు పెట్టాలన్న, కొత్త డిపాజిట్లను తీసుకోవాలన్న బ్యాంకు అంగీకరించదని ఆర్బిఐ తెలిపింది.

వీటితో పాటు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ఆస్తిని అమ్మకం లేదా ఆస్తులను బదిలీ చేయడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధాన్ని విధించింది.ముఖ్యంగా ఈ బ్యాంకులో ఉన్న సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్, అలాగే డిపాజిటర్ లకు చెందిన ఏదైనా మొత్తాన్ని ఖాతాలోని బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని నోటీస్ లో తెలిపింది.

ఈ రూల్స్ వచ్చే ఆరు నెలల వరకు అమల్లో ఉంటాయని ఆర్బిఐ స్పష్టంగా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube