లాక్‌డౌన్ పొడగింపు ఖాయం.. ఇదిగో సాక్ష్యం!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రోజురోజూకు తన జూలును విదిలిస్తూ వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఇప్పటికే కొన్ని వేళ ప్రాణాలు బలిగొన్న ఈ వైరస్ కారణంగా భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించాయి.

 Clear Evidence For Lockdown To Extend For Sure-TeluguStop.com

ప్రజలెవరూ ఇళ్ల బయటకు రావద్దంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

ఇటు భారత్‌లో మార్చి 22 నుండి పూర్తి లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.21 రోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ ఉంటున్నట్లు ఆయన వెల్లడించారు.దీంతో సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయి ఇంటిపట్టునే ఉంటున్నారు.

ఇక ఇళ్ల నుండి బయటకు రావద్దనే ఆదేశాలను వారు బేఖాతరు చేస్తూ కొంతమంది రోడ్లపైకి వస్తున్నారు.దీంతో పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు.

కాగా కేంద్ర ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని, కరోనా ప్రభావంతో దేశం స్తంభించిన కారణంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించింది.ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అయితే ఈ లాక్‌డౌన్ 21 రోజులు కాకుండా మరింత పొడిగిస్తారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది.

ఇప్పటికే మూడు నెలలకు సరిపోయే ఆహార భద్రత ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించగా, నిన్న ఆర్‌బీఐ మూడు నెలల పాటు అన్ని రకాల ఈఎంఐలపై మారిటోరియం విధించింది.

ఇక తాజాగా మే 3న జరగాల్సిన నీట్ పరీక్షను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.అంటే మే నెలలో కూడా ఈ లాక్‌డౌన్ అమలులో ఉండనున్న సంకేతాలు అందుతున్నాయి.

దీంతో ప్రజలు ఈ లాక్‌డౌన్ ఎంతకాలం ఉంటుందా అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube