నిజమా : క్లీన్‌ షేవ్‌ చేసుకుంటే ప్రాణాంతక వ్యాధి వస్తుందట

ఈమద్య కాలంలో అబ్బాయిలు క్లీన్‌ షేవ్‌ కంటే ట్రిమ్మింగ్‌కు ఎక్కువ ఇష్టపడుతున్నారు.ఎందుకంటే రఫ్‌ లుక్‌తో ఉండే అబ్బాయిలను ఎక్కువ మంది అబ్బాయిలు ఇష్టపడుతున్నారు.

అందుకే ఎక్కువ మంది అబ్బాయిలు క్లీన్‌ షేవ్‌ను ఎప్పుడో వదిలేశారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ట్రిమ్మింగ్‌ చేసుకున్న అబ్బాయిలే కనిపిస్తున్నారు.

ఇది ఒకందుకు చాలా మంచిదని, ట్రిమ్మింగ్‌ చేసుకుంటున్న అబ్బాయిలు ప్రాణాపాయం నుండి బయట పడ్డట్లే అంటూ యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ క్వీన్‌లాండ్‌ వారు చెబుతున్నారు.

ఈ ప్రముఖ యూనివర్శిటీ క్యాన్సర్‌ కారకాలు మరియు ప్రముఖ ప్రాణాంతక వ్యాధుల గురించి ప్రయోగాలు చేస్తున్నాయి.ఈ సందర్బంగా గడ్డం రెగ్యులర్‌గా క్లీన్‌ షేవ్‌ చేసే వారికి క్యాన్సర్‌ ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది అంటూ వారు ప్రయోగంలో నిర్ధారించారు.సూర్యు నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు అనేవి నేరుగా మొహంపై పడ్డప్పుడు క్యాన్సర్‌ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట.

Advertisement

ఒక వేళ గడ్డం ఉంటే అతినీల లోహిత కిరణాల తాకిడి తక్కువగా ఉంటుందని, తద్వార ప్రమాదాల నుండి బయట పడవచ్చు అంటున్నారు.

ఈ ప్రయోగంలో దాదాపు 10 వేల మంది పురుషులను వీరు పరిశీలించారు.చర్మ క్యాన్సర్‌ వచ్చిన వారిలో ఎక్కువ శాతం రెగ్యులర్‌గా క్లీన్‌ షేవ్‌ చేసేవారు ఉన్నారని, క్లీన్‌ షేవ్‌ చేయడం వల్లే వారికి ఈ క్యాన్సర్‌ వచ్చి ఉంటుందని యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ విషయమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతుండటంతో కుర్రాళ్లు కొందరు క్లీన్‌ షేవ్‌ చేసుకునే వారు ఇకపై ట్రిమ్మింగ్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రాణాంతక వ్యాధి సోకే ప్రమాదం ఉన్నప్పుడు ఎందుకు రిస్క్‌ తీసుకోవడం చెప్పండి.ఇంకా మీరు క్లీన్‌ షేవ్‌ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మీరు ట్రిమ్మింగ్‌కు మారిపోండి.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు