గత ఏడాది అక్టోబర్ నెలలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.క్రూయిజర్ రేవ్ పార్టీ పై ఎన్సీబీ అధికారులు దాడి చేస్తూ ఆర్యన్ ఖాన్ నుడ్రగ్స్ కేసులో భాగంగా అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ను సుమారు నెల రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్నారు.పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన కోర్టు విచారణ పేరుతో బెయిల్ రద్దు చేస్తూ వచ్చారు.
ఇకపోతే తాజాగా మరోసారి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది.ఆర్యన్ ఖాన్ పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జిషీట్‌ను కోర్టులో ప్రవేశపెట్టింది.ఈ క్రమంలోనే ఈ చార్జిషీట్లో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.ఆర్యన్ ఖాన్ అమాయకుడని.
అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలోనే కోర్టుకు అధికారులు సమర్పించిన చార్జిషీట్లో ఆర్యన్ పేరు లేకపోవడం గమనార్హం.
ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు అరెస్టయిన మరో ఐదుగురికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి ఆధారాలు దొరకలేదని అధికారులు ఈ చార్జిషీట్లో పేర్కొన్నారు.ఇలా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఆర్యన్ ఖాన్ ను అధికారులు తమ కస్టడీలో ఉంచి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.ఇకపోతే అప్పట్లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే ఆర్యన్ ఎలాంటి తప్పు చేసి ఉండరని కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించారని కొందరు అప్పట్లో ఆర్యన్ కి మద్దతు పలికారు.