శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి స్పెషల్ డ్యాన్స్.. మరోసారి యూట్యూబ్ రికార్డ్ కు సిద్ధం?

Classic Special Song Sai Pallavi Shyam Singha Roy

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటే వెంటనే ఆమె డాన్స్ గుర్తుకు వస్తుంది.ఎంతో ఎనర్జిటిక్ గా సాయి పల్లవి వేసే స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే.

 Classic Special Song Sai Pallavi Shyam Singha Roy-TeluguStop.com

సాయి పల్లవి సినిమాలలోని పాటలు విడుదల అవుతున్నాయి అంటే సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కావాల్సిందే.అంతగా తన డాన్స్ తో ప్రేక్షకులను సాయి పల్లవి ఆకట్టుకుంటారు.

ఈ క్రమంలోనే ఈమె నటించిన ఫిదా సినిమాలోని వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే అనే పాట ఎలాంటి రికార్డులను సృష్టించిందో మనకు తెలిసిందే.

 Classic Special Song Sai Pallavi Shyam Singha Roy-శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి స్పెషల్ డ్యాన్స్.. మరోసారి యూట్యూబ్ రికార్డ్ కు సిద్ధం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం నుంచి సారంగదరియా అనే పాట కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.

ఇప్పటికీ ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.ఇదిలా ఉండగా తాజాగా సాయిపల్లవి నటించిన “శ్యామ్ సింగరాయ్”చిత్రం నుంచి ఒక స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Dance, Sai Pallavi, Shyam Singha Roy, Tollywood-Movie

కలకత్తాలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భాగంగా ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.క్లాసికల్ డాన్స్ నేపథ్యంలో సాగే ఈ పాట త్వరలోనే విడుదల కాబోతుందని ఈ పాట ద్వారా సాయి పల్లవి మరోసారి రికార్డులు సృష్టించబోతోందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

#Dance #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube