వైరల్: పడవలోనే తరగతులు.. ఎక్కడంటే..?!

కరోనా వచ్చి అందరి జీవితాలను నాశనం చేసేసింది.చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.

 Classes On The Boat . Where . Viral Latest, News Viral, Social Media, Bihar Floo-TeluguStop.com

ఇప్పుడు వానలు మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.వరదల వల్ల చాలా ఆర్థిక నష్టం వాటిల్లింది.

విద్యారంగం పూర్తిగా చిన్నాభిన్నమైంది.కరోనా వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా కోల్పోయిన వారు, తీవ్ర నష్టాన్ని చవిచూసినవారు విద్యార్థులనే చెప్పాలి.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కరోనా వల్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.చదువు పూర్తైపోతుందనుకున్నవారు ఆగాల్సి వచ్చింది.

తరగతులు జరక్క, సరిగా చదవు అబ్బని వారు చాలా మందే ఉన్నారు.ప్రస్తుతం వానల వల్ల కొన్ని చోట్ల తరగతులు నిలిచిపోయాయి.

అయితే ఓ చోట మాత్రం వాన వచ్చినా, వరదలు పారినా కూడా తరగతులు నిర్వహిస్తున్నారు.వరదల్లో కూడా పడవలపైన విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఘటన బీహార్ రాష్ట్రంలోని కతిమార్ జిల్లా మహనీహరి ప్రాంతంలో చోటుచేసుకుంది.

రాష్ట్రాంలో గత కొన్ని రోజులుగా భారీవర్షాలు కురిశాయి.దీంతో కతిహార్ జిల్లా మహనీహరి ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి.

వరదల వల్ల పాఠశాలలు నీట మునిగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు పడ్డారు.దీంతో పాఠశాల ఉపాధ్యాయులు పడవలపై వెళ్లి విద్యార్థులను ఎక్కించుకొని తరగతులు నిర్వహించారు.దీనివల్ల ఉపాధ్యాయులు అందరి ప్రశంసలు అందుకున్నారు.వరదనీరు తమ ప్రాంతంలో ఆరు నెలల పాటు ఉంటే తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు.

అసలే కరోనా వైరస్ మహమ్మారి వల్ల పిల్లల విద్య గత రెండు సంవత్సరాల నుంచి అంతంత మాత్రంగానే సాగుతోంది.

Telugu Bihar, Bihar Floods, Classes, Latest-Latest News - Telugu

దీనికి తోడు ఇలా వరదల వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లితే చాలా ఇబ్బందులు పడాల్సి రావచ్చని వారు చెబుతున్నారు.లాక్ డౌన్ వల్ల సిలబస్ పూర్తి కాక విద్యార్థులు అవస్తలు పడ్డారు.అందుకే ఉపాధ్యాయులు పడవలపై వచ్చి తరగతులు నిర్వహిస్తున్నారు.

గంగానదితోపాటుగా ఉపనదులు వరదలతో ప్రమాదకరంగా మారాయి.వరదల వల్ల విద్యార్థులు నష్టపోకుండా వారికి పడవల్లోనే ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube