బీజేపీలో మొదలైన వర్గ పోరు.. అసలు కారణం ఇదేనా

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అనేది చాలా దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే అధికార కైవసంపై దృష్టి పెట్టిన బీజేపీ టీఆర్ఎస్ పార్టీ, కెసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

 Class Struggle Started In Bjp  Is This The Real Reason Bandi Sanjay, Telangana P-TeluguStop.com

బీజేపీలో ఇప్పుడు ఇతర పార్టీల నుండి చేరికలు ఎక్కువైన విషయం తెలిసిందే.అందులో భాగంగా ఇక తమకు అనుకూలంగా ఉన్న నాయకుడికి అంతగా ప్రాధాన్యత దక్కడం లేదనే ఆలోచనతో బండి సంజయ్ ముందే వర్గ విభేదాల చర్చ జరగడమే కాక అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారట.

ఇలా జరుగుతుంది ఎక్కడో కాదు బండి సంజయ్ స్వంత నియోజకవర్గం కరీంనగర్ లో కావడం అత్యంత ప్రాధాన్యమైన విషయం.అయితే ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం బీజేపీలో వర్గ పోరు అంశం ఇప్పుడిప్పుడే బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇది కొంత ఇబ్బందికర పరిణామం అని చెప్పవచ్చు.  అయితే పార్టీలో ఇతర పార్టీల నుండి నేతల చేరికతో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకు కొంత అభద్రతాభావం అనేది ఏర్పడడంతో ఈ తరహా వర్గ పోరు అనే సమస్య ఏర్పడింది.

అయితే రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం ఈ వర్గ పోరు అంశంపై మాత్రం స్పందించడానికి నిరాకరించినా పార్టీలో మాత్రం ఈ అంశంపై అంతర్గతంగా చర్చ మాత్రం నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణపై క్షేత్ర స్థాయిలో బీజేపీ కేంద్ర నాయకత్వం పూర్తిగా దృష్టి పెట్టిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు చాలా రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.మరి బీజేపీ ఈ విషయాన్ని చాలా చిన్న విషయంగా పరిగణిస్తుందా లేక పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Class Struggle Started In BJP Is This The Real Reason Bandi Sanjay, Telangana Politics, Bjp Party, Trs Party , Kcr , Elections , Etala Rajender , Central Govt, Teenmar Mallanna - Telugu Bandi Sanjay, Bjp, Central, Etala Rajender, Telangana, Trs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube