షారుఖ్ ఖాన్, కాజోల్ మధ్య గొడవలు.. అందుకే అతని పుట్టినరోజు అలా?

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజోల్ గురించి అందరికీ పరిచయమే.సినీ ఇండస్ట్రీకి బాలనటిగా పరిచయమైన ఈమె అతి తక్కువ సమయంలో ఎన్నో సినిమాల్లో నటించింది.

 Shah Rukh Khan, Bollywood, Hero, Kajol, Hero, Clashes,latest News-TeluguStop.com

స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక ఈమె బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు మరో నటుడు షారుఖ్ ఖాన్ తో గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది.

Telugu Bollywood, Clashes, Kajol, Shah Rukh Khan-Movie

అదేంటి.కాజోల్, షారుఖ్ ఖాన్ కు మధ్య గొడవలు ఏంటి.వీరిద్దరు కలిసి పలు సినిమాలలో కూడా నటించారు కదా.మంచి స్నేహితులుగా కూడా ఉండేవాళ్ళు కదా అని అనుకుంటున్నారా.ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం.ఇటీవలే షారుఖ్ ఖాన్ తన 56వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.దీంతో ఆయనకు ఆయన అభిమానులు, సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు.

కానీ కాజోల్ మాత్రం తనకు బర్త్ డే విషెస్ చెప్పలేదు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.మామూలుగా కాజోల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది.అందులో ఓ నెటిజన్.

షారుఖ్ ఖాన్ పుట్టినరోజుకు ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదని కాజోల్ ను ప్రశ్నించాడు.

Telugu Bollywood, Clashes, Kajol, Shah Rukh Khan-Movie

దీంతో ఈ ప్రశ్నకు స్పందించగా.షారుఖ్ కుమారుడు ఇటీవలే జైలు నుంచి ఇంటికి తిరిగి రావడంతో ఆయన ఆశలు ఫలించాయి.దాంతో ఆయనకు ఇంతకంటే సంతోషకరమైన విషయం మరేమీ ఉండదని తెలిపింది కాజోల్.

కొందరు మాత్రం వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగాయని అందుకే తాను అలా అబద్ధం చెప్పి తప్పించుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube