విజయ్ దేవరకొండ మీద కోపంతో ఉన్న పూరీ  

clashes between puri jagannadh and vijay devarakonda, Charmi Kaur, Fighter Movie, Telugu Cinema, Karan Johar, Pan India Movie - Telugu Charmi Kaur, Fighter Movie, Karan Johar, Pan India Movie, Telugu Cinema

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఫైటర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది.

 Clashes Between Puri Jagannadh Vijay Devarakonda Fighter Movie

కరోనా సిచువేషన్ కారణంగా వాయిదా పడింది.పరిస్థితితులు సాధారణ స్థితికి రాగానే షూటింగ్ కి వెళ్ళడానికి పూరీ టీం రెడీ గా ఉంది.

ఇక సినిమా షూటింగ్ మెజారిటీ విదేశాలలో ఉంది.అయితే ప్రస్తుత పరిస్థితిలో అక్కడికి వెళ్లిస షూట్ చేయడం కష్టం కాబట్టి కథలు మార్పులు చేయడానికి పూరీ రెడీ అయ్యాడని ఆ మధ్య టాక్ వినిపించింది.

విజయ్ దేవరకొండ మీద కోపంతో ఉన్న పూరీ-Movie-Telugu Tollywood Photo Image

అయితే కథలో ఎలాంటి మార్పులు చేయడం లేదని, పూరీ ముందు ఏదైతే కథ అనుకున్నారో అదే కథని తెరకేక్కిస్తారని చార్మీ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఫిలిం నగర్ లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.

విజయ్ దేవరకొండ విషయంలో పూరి జగన్నాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని సమాచారం.కథలో చాలా వరకు మార్పులు చేయాలి అంటూ పూరి జగన్నాథ్ ని విజయ్ దేవరకొండ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లాక్ డౌన్ సమయంలో కథను మార్చాలి అంటూ పూరి జగన్నాథ్ పై విజయ్ దేవరకొండ ఒత్తిడి చేశాడని టాక్ నడుస్తుంది.

కథలో విజయ్ ఇన్వాల్వ్ మెంట్ పై పూరీ చాలా అసహనంగా ఉన్నాడని తెలుస్తుంది.

తనకు కథ ఎలా ఉందో ఎలా ఉండాలో స్పష్టమైన అవగాహన ఉందని తనకు కొత్తగా ఏమీ నేర్పవద్దనీ విజయ్ కి స్పష్టంగా చెప్పాడట.అయితే సినిమాలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉండాలి అంటూ విజయ్ దేవరకొండ నుంచి ఒత్తిడి వస్తుందని టాక్.

తనను యూత్ ఆదరించింది రొమాంటిక్ సీన్లు విషయంలో అని, ఖచ్చితంగా ఆ సీన్లు ఉండాలి అంటూ పూరిపై విజయ్ కాస్త ఘాటుగా చెప్పటంతో అవసరం అయితే తాను సినిమా నుంచి తప్పుకుంటానని తనకు కథ విషయంలో ఎలాంటి సలహాలు ఇవ్వద్దు అని పూరీ జగన్నాథ్ మొహం మీద చెప్పేశాడట.అయితే విజయ్ దేవరకొండ అలా కథలో వేలు పెట్టె రకం కాదని, కావాలని అతని మీద దృష్ప్రచారం చేస్తున్నారని అతని సన్నిహితులు అంటున్నారు.

#Pan India Movie #Charmi Kaur #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Clashes Between Puri Jagannadh Vijay Devarakonda Fighter Movie Related Telugu News,Photos/Pics,Images..