కొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిన విషయమే.ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసేవారు మరియు పార్టీలో సీనియర్లతో పరిచయాలు ఉండి, అదిష్టానంకు దగ్గరగా ఉన్న వారు సమానంగా గౌరవించబడతారు.

 Clashes Between Congress Leaders-TeluguStop.com

పార్టీలో సీనియారిటీకి ముందు ప్రాముఖ్యత ఇచ్చేది ఏమీ ఉండదు అనేది విమర్శ ఉంది.తాజాగా అదే సంఘటన జరిగింది.

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్ష పార్టీలు ఆందోళన చేశాయి.ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్‌ తరపున పలువురు తరలి వచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీహెచ్‌తో పాటు పార్టీ ఇంచార్జ్‌ కుంతియా కూడా హాజరు అవ్వాల్సి ఉంది.అయితే కుంతియా రాలేదు.

కుంతియ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో టీపీసీసీ సెక్రటరీ నగేష్‌ కూర్చున్నాడు.

కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేష్‌ కూర్చోవడంపై వీహెచ్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

అది ఏమాత్రం కరెక్ట్‌ కాదు, వెంటనే కుర్చీ దిగమంటూ నగేష్‌ను నెట్టివేయడం జరిగింది.వీహెచ్‌ నెట్టి వేయడంతో నగేష్‌ కింద పడ్డాడు.

నగేష్‌ అదే సమయంలో వీహెచ్‌ను లాగేశాడు.ఇద్దరు ఒకరిని ఒకరు లాక్కుని కింద పడ్డారు.

ఆ తర్వాత కొట్టుకునే వరకు వెళ్లారు.అయితే విపక్ష పార్టీల నాయకులు వారిని వారించి గొడవ సర్దుమనిగేలా చేశారు.

ఈ సంఘటనపై పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.విపక్ష పార్టీల కార్యక్రమంలో ఇలా చేయడం ఏంటని ఇద్దరిని మందలించినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube