గుంటూరు పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ.. వైసీపీ వర్సెస్ జనసేన.. ?

ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు తీవ్రంగా సాగుతుందట.

 Guntur, Panchayat Elections, Ycp, Janasena, Clash,latest Poilitecal News,ap-TeluguStop.com

ఇప్పటికే వైసీపీ పై టీడీపీ విమర్శలు చేస్తూ, అధికారపార్టీ నాయకులు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తుంది.అదీగాక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ, శత్రుచర్ల చంద్రశేఖర రాజు, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.

ఇక గుంటూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.ఇప్పటికే మూడు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి.కాగా ఈ మూడు విడతల్లో అధికార పార్టీ వైసీపీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు.అయితే నాలుగో విడత ఎన్నికల్లో కూడా విజయం తమదే అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇకపోతే ఈ ఎన్నికల నేపధ్యంలో గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.తమ మీద వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారని జనసేన ఎస్ఈసికి ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడం తప్పని సరి అయ్యిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube