బాబాయ్ – అబ్బాయ్, అబ్బాయ్ – బాబాయ్ అంటూ ఆప్యాయపు పిలుపులు ఇప్పుడు ఆ కుటుంబంలో కనిపించడం లేదు.ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగానే వారు ఉంటున్నారు.
గతంలో ఉన్న ఆ అనుబంధం మాటల్లో కూడా కనిపించడం లేదు.ఆ కుటుంబమే నందమూరి కుటుంబం.
నందమూరి హీరోలైన బాలయ్య , కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఒకరకమైన అనుబంధం కనిపించేది.కానీ ఆ ఇద్దరు యువ హీరోలు బాబాయ్ బాలయ్యను పక్కకు పెట్టేసినట్టు కనిపిస్తోంది.
ఒకప్పుడు కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ దూరం దూరంగా ఉన్నట్టు కనిపించేవారు.కానీ ఇప్పుడు వారిద్దరూ బాగా క్లోజ్ అయిపోయి బాబాయ్ బాలయ్య కు దూరం అయ్యారు.
ఇద్దరు ఇప్పుడు సొంత అన్నదమ్ములా మెలుగుతున్నారు.తారక్ లేనిదే కళ్యాణ్ రామ్ సినిమా ఆడియో ఫంక్షన్లు జరగవు.అన్నయ్య-తమ్ముడు అంటూ ఆప్యాయంగా మెలుగుతున్నారు.అది చూసిన బాలయ్యకు ఎక్కడో కాలింది.అప్పటి నుంచి బాలయ్య కళ్యాణ్ రామ్ ను పక్కనబెట్టేసాడు.ఇది జరిగి చాలా కాలమవుతోంది.
అయితే తాజాగా జరిగిన కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో ఇదంతా నిజమేనని మరోసారి ఆయన మాటల్లోనే చెప్పేసాడు.
నిన్నటి తరం హీరోల్లో తనకు నచ్చిన లక్షణాలు గురిచి చెబుతూ చిరంజీవి, నాగార్జు, వెంకటేష్ ల గురిచి ప్రస్తావించాడు గానీ.
సొంత బాబాయ్ బాలయ్య పేరు ఎక్కడా చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.అంతే కాదు ఎన్టీఆర్ బయోపిక్ విషయం కూడా తనకు పెద్దగా తెలియదని ముఖం చాటేసాడు.తేజ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ పాత్ర కోసం అడిగారని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదని చెప్పాడు కళ్యాణ్ రామ్ చెప్పాడు.అంతేకాకుండా బాబాయ్ అబ్బాయ్ ల మధ గ్యాప్ రావడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మధ్యనే టీడీపీ కి మా ఇద్దరు అబ్బాయిలు నేను ప్రచారం చేయబోమని నందమూరి హరికృష్ణ చెప్పడం ఇక్కడ కొసమెరుపు.మొత్తానికి నందమూరి కుటుంబంలో చిచ్చు రేగింది అన్నది వాస్తవం .